వైసీపీ మండల కన్వీనర్ చౌడేశ్వర గురువారం మద్దిరాలపల్లి, కోటకొండ, తాండ, నాయనవారిపల్లి, ఏటిగడ్డ గ్రామాల్లో 'బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేసిన ఘనత వైసీపీదేనని స్పష్టంచేశారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి పథకాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ ఆరోపించారు.