తంబళ్లపల్లె: ములకలచెరువులో తేలికపాటి వర్షం

తుఫాను ప్రభావంతో ములకలచెరువులో గురువారం ఉదయం తేలికపాటి వర్షం కురుస్తోంది. రోడ్లు, వీధులు జలమయం అయ్యాయి. దీంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు వణుకుతున్నారు. మరో 48గంటలపాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్