నారాయణ పాఠశాలలో వనమహోత్సవం

తంబళ్లపల్లెలోని నారాయణ పాఠశాలలో 2026 జూలై 4న వనమహోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల AGM ఫణి కుమార్, RI ఆంజనేయులు, ప్రిన్సిపాల్ ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్స్ జయచంద్ర, నాగమణి, రూబీ, రోజ, AO ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్