మల్లయ్యకొండ సంపద తవ్వితే ఊరుకోం: సురేంద్ర యాదవ్

తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మల్లయ్యకొండ పుణ్యక్షేత్ర సంపదను తవ్వితే ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్ర యాదవ్ హెచ్చరించారు. ఈ నెల 29న సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంగళ్ళు బస్టాండ్ నుండి కూటమి నాయకులతో కలిసి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ శివాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుహాసిని ప్రసాద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారని, సమావేశాన్ని విజయవంతం చేయాలని సురేంద్ర కోరారు.

సంబంధిత పోస్ట్