ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల 3 నుంచి 13 వరకు పాఠశాలలకు దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే నెల 14న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే వరద నేపథ్యంలో ఈసారి పాఠశాలలకు సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో దసరా సెలవులను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.