డిసెంబర్ లోపు మరో 4.50 లక్షల ఇళ్లు: CM చంద్రబాబు

AP: పేదల గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని, డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇవాళ (సోమవారం) తిరుపతి జిల్లా నాయుడుపేటలో సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించిన వారికి ఫ్లాట్లు ఇవ్వలేదని, వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్