ఏపీకి మరో వాయుగుండం ముప్పు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, తదుపరి తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ నెల 28 నాటికి ఇది కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీని ప్రభావంతో ఏపీలో నేటి నుండి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా బలపడనుండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕