ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖకు చెందిన మరో బోటు

AP: ఒడిశా తీరంలో విశాఖకు చెందిన మరో బోటు చిక్కుకుంది. ఇంజిన్ పాడైపోవడంతో 4 రోజులుగా మత్స్యకారులు ప్రాణాలు కాపాడుకున్నారు. తమ సమస్యను వీడియో సందేశం ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులను తక్షణమే రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా, జూన్ 22న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి బోటు వెళ్లింది.

సంబంధిత పోస్ట్