మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో మరో కేసు నమోదైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై అసత్య ప్రచారం చేస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశారంటూ టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అంబటి రాంబాబుపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్