AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్‌గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి నగదు వసూళ్లు చేసినట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు.