బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

ఉత్తర అండమాన్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బలపడి, సోమవారం వాయుగుండంగా, మంగళవారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం నాటికి ఇది దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోకి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕