AP: రాష్ట్ర ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్కు సిద్ధమవుతోంది. టీచర్ల ఖాళీల వివరాలను సేకరించి, అవసరమైన పోస్టుల భర్తీకి విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డీఎస్సీతో పాటు డైట్, ఎన్సీఈఆర్టీ, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 2,500కు పైగా పోస్టులతో అక్టోబర్ 15న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో మంత్రి లోకేశ్ ఏటా డీఎస్సీ ప్రకటన ఉంటుందని ప్రకటించారు.