మరో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు!

AP: బంగాళాఖాతంలో ఈ నెల 13న ఆగ్నేయ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని గమనం, తీవ్రతను బట్టి వర్షాలపై స్పష్టత రానుంది. ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే సూచనలున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕