AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు తాజాగా కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు. సాయికృష్ణ మరణంలో కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. మరోవైపు, సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతన్ని హాజరుపరచాల్సి ఉంది. తీవ్రంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మరణించినట్లు సిట్ విచారణలో తేలింది.