బంగాళాఖాతంలో మరో తుఫాన్!

AP: రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈనెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీవ్రవాయుగుండం లేదా తుఫాన్‌గా మారి, 16 మరియు 17 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, పొడిగాలులు వీస్తుండటం వల్ల ఈ తుఫాన్ బలహీనపడే అవకాశం కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕