2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కీ రోల్ పోషించాయి. మొన్నటివరకు చంద్రబాబు మంచి చేస్తారని భావించారు ప్రజలు. తాజాగా చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని ప్రకటించడంతో హామీలకు ఆకర్షితులైన ప్రజలు కూటమి సర్కార్‌పై తమకు నమ్మకాలు లేవని అంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలకు ప్రజల నుంచి ముప్పు తప్పదని రాజకీయ నిపుణులు అంటున్నారు.