బొత్స ఇంట్లో మరో వికెట్ ఔట్.. బడ్డుకొండ అప్పలనాయుడు సస్పెండ్‌

AP: వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కుటుంబంలో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. బొత్స మేనల్లుడు, జడ్పీ మాజీ చైర్మన్‌ చిన్న శ్రీను ఇటీవల వైసీపీకి రాజీనామా చేయగా.. తాజాగా ఆయన వియ్యంకుడు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును పార్టీ సస్పెండ్‌ చేసింది. తొలుత నెల్లిమర్ల ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించిన వైసీపీ అధిష్ఠానం.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సస్పెన్షన్‌ వేటు వేసింది. చిన్న శ్రీను రాజీనామా అనంతరం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో బొత్స, బడ్డుకొండ భావోద్వేగానికి గురైనప్పటికీ.. అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕