ఏపీ- 54 శాతం వర్షాల లోటు

ఏపీలో ఎల్ నినో ప్రభావం తీవ్రమవుతోంది. ఇప్పటికే 40% ఉన్న వర్షపాత లోటు 54 శాతానికి పెరిగింది. దీనితో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. 2.44 లక్షల హెక్టార్లలోని పంటలపై ఎల్ నినో ప్రభావం ఉందని, 1,92,387 హెక్టార్లలో తేమ ఒత్తిడి, 41,474 హెక్టార్లలో పంటలు వాడిపోయాయని, 10582 హెక్టార్లలో పంటలు ఎండిపోయాయని అధికారులు నివేదిక సమర్పించారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను రక్షించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕