AP: స్పేస్ ఎకానమీకి కేంద్రంగా ఏపీ ఎదుగుతోందని మంత్రి లోకేశ్ అన్నారు. శుక్రవారం సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఏపీ ప్రత్యేక గమ్యస్థానంగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. స్పేస్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.