ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో సమావేశాలు మొదలవుతాయి. ఈ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై కీలక చర్చలకు వేదిక కానున్నాయి. ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.