ఏపీ బడ్జెట్ సిద్ధం.. ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టే అవకాశం

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈసారి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ 3.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని అంచనా. అమరావతి, పోలవరం, సాగునీటి పారుదల రంగానికి కేటాయింపులు ఉండొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్