AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.