AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. సుమారు 70 అజెండా అంశాలపై చర్చించి, రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే సంస్థలకు భూముల కేటాయింపు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ వంటి కీలక అంశాలను ఆమోదించింది.