నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

AP: సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు కీలక కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు ముఖ్యమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఏర్పాటు చేయనున్న ఎల్.వి. ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕