నేడు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ భేటీ

AP: సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్లు, సచివాలయ, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు రూ.2540 కోట్లు, ఏపీ శాసనసభ భవనంలో సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ.798 కోట్లు, ఎల్పీఎస్ జోన్ 11లో మౌలిక సదుపాయాల కల్పనకు, రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్ కు కేబినెట్ ఆమోదం తెలపనున్నారు.

సంబంధిత పోస్ట్