AP: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ ప్రతిపాదనలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు రూ.596 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉంది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.533 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరగనుంది. రైతుల ప్లాట్లలోని చిన్న రహదారులకు బీటీ రోడ్లు నిర్మించేందుకు సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.