ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. రాష్ట్రాన్ని క్వాంటం కంప్యూటింగ్‌ రంగంలో కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడి, ఐదు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖలో రహేజా పరిశ్రమతో పాటు, కాపులుప్పాడ, తిరుపతి, ఓర్వకల్లులో కొత్త యూనిట్లు, నెల్లూరులో ఫైబర్‌ సిమెంట్‌ ప్లాంట్‌, అనంతపురంలో టీఎంటీ బార్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్