AP: కొన్నేళ్లుగా రాజధాని అమరావతి చుట్టూ రగడ జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అమరావతిని రాజధానిగా గుర్తించింది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. మూడు రాజధానుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. కట్ చేస్తే అమరావతి వ్యవహారం చుట్టూ రాజకీయ రచ్చ నడిచింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. పార్లమెంట్‌లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి రాజధాని అమరావతిని ఆమోదించేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది.