ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఉత్తర్వులిచ్చింది. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్.. 2026 మార్చి 1న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే పదవీకాలం ముగియగా.. ఆయన పదవీకాలాన్ని నవంబర్ 30 వరకు ఆరు నెలల పాటు పొడిగించారు.తాజాగా 2027 మే 31 వరకు మరో ఆరు నెలల పాటు ఆయన సర్వీసును పొడిగించారు.