అక్వాన్ తుఫాన్.. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్

AP: కోస్తాలోని ఏడు జిల్లాలకు 'ఆక్వాన్' తుఫాన్ కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాకినాడ–యానాం, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో గురు, శుక్ర వారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తుఫాన్ గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతూ, గురువారం ఉదయానికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. 20న నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕