AP: ముంచుకొస్తున్న'అర్ణబ్‌' తుఫాన్

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో బలపడనుంది. ఇది అక్టోబర్ 26 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నేటి నుండి రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕