AP: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. జూన్ 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్, సీబీఎస్‌ఈ రివ్యాల్యూయేషన్ ఫలితాల కారణంగా ఫలితాల విడుదల రెండు సార్లు వాయిదా పడింది.