AP: బీటెక్, బీఈ, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2026 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 28న విడుదల కానున్నాయి. ఆన్‌లైన్ రాత పరీక్షలు మే 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 12-18 వరకు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మే 19-20 తేదీల్లో జరగనున్నాయి. ప్రిలిమినరీ కీ మే 23న విడుదల చేసి, అభ్యంతరాలను మే 25 వరకు స్వీకరించనున్నారు. జూన్ 1న ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్ష 3 గంటల సమయం, 160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఇంగ్లిష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.