ఏపీకి వాయుగుండం ముప్పు.. అత్యంత భారీ వర్షాలు

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిందని APSDMA తెలిపింది. రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి.. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆది, సోమ వారాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్