AP: మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎంపీటీసీ స్థానాల తొలి ఫలితాలు

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్ల లెక్కింపు ప్రక్రియను శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించి, రాత్రి 8 గంటల లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం జిల్లాల్లోని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎస్‌ఈసీ పునేఠా, కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వర్షాల వల్ల మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో జాప్యం జరిగినప్పటికీ, పరిషత్ ఎన్నికల ఫలితాలను 12 గంటల గడువులోగా వెల్లడించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕