ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం (APNRTS) కోఆర్డినేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ విదేశాల్లోని ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రాంతీయ, రాష్ట్ర, దేశ స్థాయిలో 600 మందికి పైగా కోఆర్డినేటర్ల నియమించింది. ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభ్యున్నతికి కోఆర్డినేటర్లు కృషి చేయనున్నారు. APNRTS, భారత ఎంబసీలు, స్థానిక ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ కోఆర్డినేటర్లు స్వచ్ఛంద సేవలు అందించనున్నారు.