AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అయితే, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తాము కట్టుబడి ఉన్నామని కూటమి నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ అధికారులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.