ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2309 విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. వీటి నిర్మాణానికి అవసరం అయిన రూ.217.10 కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2309 భవనాలను MGNREGS పథకం కింద నిర్మాణానికి ఆమోదం తెలపగా.. అదనంగా మరో 696 భవనాలను PM-ABHIM స్కీం కింద నిర్మాణానికి అనుమతించారు.