ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాల వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు. 'తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనాన్ని తీవ్రంగా విమర్శించారు. గత రెండు నెలలుగా తమ పార్టీ చెబుతోన్న వాదనల్ని ఇప్పుడు కృష్ణా బోర్డు కూడా సమర్థించిందని తెలిపారు. అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు అక్రమంగా 65 TMC ల నీటిని తీసుకెళ్లిందని' ఆరోపించారు.