AP: బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై నేడు మధ్యాహ్నంలోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గట్టి వాదనలు వినిపించేందుకు అత్యున్నత నాయ్యస్థానంలో సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దించాలని స్పష్టం చేశారు.