రూ. 13 వేల కోట్లు కొత్త ఆదాయ లక్ష్యం.. వసూళ్లకు కసరత్తు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 13 వేల కోట్ల కొత్త ఆదాయాన్ని సాధించే లక్ష్యంతో వివిధ మార్గాల్లో ప్రజల నుండి వసూళ్లకు కసరత్తులు చేస్తోంది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ హెచ్‌ఓడీ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. SGSTపై 1% సెస్ ద్వారా రూ. 4,700 కోట్లు, ఏపీ లాటరీ ద్వారా రూ. 3 వేల కోట్లు, ఆన్‌లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ. 1,400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను రూపంలో ₹2,300 కోట్లు, రెండో, మూడో స్థాయి అమ్మకాలపై VAT ద్వారా ₹1,300 కోట్లు, ప్రొఫెషన్ టాక్స్ పెంపు ద్వారా ₹400 కోట్లు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ప్రొఫెషన్ టాక్స్ వసూళ్ల బదిలీ ద్వారా ₹110 కోట్లు వసూలు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్