ఆ నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉంది: మంత్రి నిమ్మల

ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న 3వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలను వినియోగించుకునేలా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్