AP: ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువును పొడిగిస్తూ మండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. ఒకవేళ ఆ గడువులోగా చెల్లించలేని వారికి రూ. 1,000 అపరాధ రుసుముతో నవంబర్ 17 వరకు అవకాశం కల్పించారు. విద్యార్థులు ఈ గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.