ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షల తాత్కాలిక టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ప్రథమ సంవత్సరం పరీక్షలు 2027 ఫిబ్రవరి 24 నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని బోర్డు సూచించింది.