దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత తెలంగాణ, కేరళ రాష్ట్రాలున్నాయని తెలిపారు. కడప జిల్లా గూడెంచెరువులో శుక్రవారం నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ తీరుపై స్పందించారు. ‘పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి. నాయకుడే రెచ్చగొడితే ఇక కిందిస్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఎవరు ఎక్కడ ఆందోళన చేసినా వెంటనే చర్యలుంటాయి’ అని అన్నారు.