ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి వై. శ్రీకాంత్‌ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేపీ రావు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన కబడ్డీ వర్గాల్లో కలకలం రేపింది.