AP: ద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచి పదవికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. బనగానపల్లె పంచాయతీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఇందిరా రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.