AP: యువతకు 4 లక్షల సబ్సిడీతో కొత్త పథకం

AP: రాష్ట్ర ప్రభుత్వం బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ లేదా ఎం-ఫార్మసీ చదివిన బీసీ యువతీ యువకులు జెనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు భారీ సబ్సిడీని అందిస్తోంది. ఒక్కో షాపు ఏర్పాటుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో ప్రభుత్వం 50 శాతం మొత్తం అయిన రూ.4 లక్షలను సబ్సిడీ రూపంలో ఇస్తుంది. మిగిలిన రూ.4 లక్షలను బ్యాంకు రుణంగా అందిస్తారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 198 జెనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕