ఏపీ నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్టీ) సొసైటీ, ప్రవాసాంధ్రుల అభ్యున్నతి, సంక్షేమం కోసం రెండో విడతలో 292 మందిని కోఆర్డినేటర్లుగా నియమించింది. భారత ఎంబసీలు, స్థానిక ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛంద సేవలు అందించేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు సొసైటీ ప్రకటించింది. కొత్తగా నియమితులైన వారికి ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ప్రెసిడెంట్ వేమూరి రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు.