AP: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులు లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. ముందుగా సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలు వెల్లడికానున్నాయి.